Header Banner

కృష్ణా జిల్లా సముద్ర తీరంలో హై అలర్ట్! 110 కిలోమీటర్ల మేర గ్రామాల్లో హెచ్చరికలు!

  Wed May 07, 2025 19:40        Others

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఇవాళ జరిగిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో పాకిస్తాన్ నుంచి ప్రతీకార దాడులు, చొరబాట్లు జరగవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ లోని కోస్తా తీరాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తీర ప్రాంతాల నుంచి తీవ్రవాదులు చొరబడే అవకాశం ఉండటంతో నేవీ మెరైన్ పోలీసు స్టేషన్లను హైఅలర్ట్ చేస్తోంది. దీంతో పాటు తీర గ్రామాల్లోనూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 

ఆపరేషన్ సింధూర్ తర్వాత కృష్ణా జిల్లాలోని సముద్ర తీరంలో హైఅలర్ట్ కొనసాగుతోంది. భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో కేంద్రం తీర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించింది. సముద్ర మార్గంలో ఉగ్రవాదులు జిల్లాలోకి రాకుండా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో 110 కిమీ సముద్రతీరం ఉంది. దీని గుండా ఉగ్రవాదులు దేశంలోకి ప్రవేశించకుండా గస్తీ పెంచారు.

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు శుభవార్త! కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం! ఎప్పటి నుండి అంటే!

 

మరోవైపు కృష్ణాజిల్లా పరిధిలో 3 మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో పాలకాయతిప్ప (కోడూరు మండలం), గిలకలదిండి (మచిలీపట్నం), ఒర్లగొందితిప్ప (కృత్తివెన్ను మండలం) మెరైన్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 150 మంది సిబ్బంది ఉన్నారు. ప్రతి సముద్ర తీర గ్రామంలో మెరైన్ పోలీసులతో పాటు రెండు డ్రోన్ కెమెరాల‌తో పహారా కాస్తున్నాయి. అదే సమయంలో తీర గ్రామాల ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. మచిలీపట్నం మెరైన్ పోలీస్ స్టేషన్ పరిథిలో ప్రస్తుతం మెరైన్ బోట్లు వినియోగంలో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి కొత్త బోట్లను రప్పిస్తున్నారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KrishnaDistrict #SeaAlert #CoastalWarning #CycloneAlert #AndhraPradeshNews #TeluguNews #DisasterAlert #WeatherUpdate